Story of BALAJI KUMAR V(PHOTOGRAPHER)

 

BALAJI KUMAR V(25)

Habitat : Venkatagiri, India

Profession : Photographer
Education : Animation & VFX Diploma
Passion : Wildlife Photography 

Instagram ID : @balajikumar_photography


నాపేరు బాలాజీ కుమార్ , మా ఊరు వెంకటగిరి ,నెల్లూరు జిల్లా , చెన్నై లో యానిమేషన్ నెరర్చుకుంటున్న సమయం లో సన్నిహితులతో కలిసి త్రివేండ్రం వెళ్ళాను నాకు ఫోటోగ్రఫీ పై ఆసక్తి ఉండటం వల్లన నా తోటి మిత్రుడు నాకు తన కెమెరా ఇవ్వడం జరిగింది, అక్కడ నా మొదటి కెమెరా ప్రయాణం మొదలైంది. అక్కడ ఉండే ప్రదేశాలను DSLR తో ఫోటో తీయడం వల్ల అద్భుతంగా అనిపించింది , ఆ తీసే క్రమంలో ఒక పక్షి ఫ్రేమ్ లోకి వచ్చింది తీస్తే అందంగా అనిపించింది అలా కొన్ని తీస్తూ వచ్చాను , 2016 లో Canon750D ఇది నా మొదటి కెమెరా తీశాను అక్కడినుంచి నా బర్డ్ ఫోటోగ్రఫీ ప్రస్థానం మొదలైంది , అప్పటి నుంచి కొన్ని ప్రదేశాలకు పక్షుల కోసం వెళ్లడం జరిగింది , కర్ణాటక , కేరళ , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , కొన్ని ప్రదేశాలు వెళ్ళాను , మా ఊరి పక్కనే ఉన్న తిరుపతి కి వెళ్లి కొన్ని పక్షుల ఫోటోలు తీస్తుండగా అక్కడ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ 'కార్తిక్ సాయి' పరిచయం అవ్వడం జరిగింది. అక్కడ నుంచి మా స్నేహం బలపడింది , అప్పటి నుంచి మేము ఇద్దరం కొన్ని ప్రాంతాలు పక్షులకోసం సందర్శించడం జరిగింది, ఎన్నో రకాలైన పక్షి జాతి ఫోటోలు తీయడం జరిగింది , మా ఊరిలో ఒక రోజు సాయంకాలం బయటకు వెళ్తున్నప్పుడు ఒక "తెల్ల కాకి" ఎదురైంది దాని నా కెమెరాలో బందించాను.. తెల్లకాకి కోసం మూడురోజులు వేచి ఉన్నాను , మూడోరోజు ఆ ఫోటో తీయడం జరిగింది , నాకు ఆ ఫోటో తీసినప్పుడు వచ్చిన ఆనందానికి అవధులులేదు , ఇలా ఎన్నో పక్షి జాతులు అంతరించి పోతున్న ఈ ఆధునిక యుగంలో నా చిన్న చిరు ప్రయత్నం ఈ పక్షి జాతి అన్నిటిని ఫోటోలు తీసి తెలియని ఎంతో మంది ప్రజలకు తెలియజేయలనుకుంటున్నాను. మనం వాడుతున్న పెద్ద టెక్నాలజీ వల్లనే ఆ చిన్న ముగా జీవులకు మరణం స్తంభవిస్తుంది.













Last But Not Least పర్యావరణాన్ని కాపాడండి పక్షి జాతులని పరిరక్షించండి.


1 comment:

STORY OF HOMAIRA MIM (ARTIST)

  Habitat: Chittagong, Bangladesh Profession: Artist Education: Honours Passion:  Arts Instagram ID: @ homairas_artistry_