MUNI SAI KUMAR(24) |
Habitat : Venkatagiri, India
Profession : 3D Modelling & Texturing Artist
Education : Diploma
Passion : Pencil Drawing
Instagram ID : @saipencilarts
నా పేరు మునిసాయికుమార్ , మా ఊరు వెంకటగిరి టౌన్ , నెల్లూరు జిల్లా , చదివింది డిప్లొమా నాకు క్రియేటివ్ ప్రపంచం అంటే చాలా ఇష్టం అలా VFX Professional Course చేసి , ఇప్పుడు 3D Modeling and Texturing Artist గా జాబ్ చేస్తున్నాను ప్రస్తుతం.
ఇంకా పోతే నా గురించి చెప్పాడని పెద్ద స్టోరీ లు లేవు కానీ నాకు డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం ఆ ఇష్టం ఎలా వచ్చింది అంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అతను ఉండే వాడు అతను డ్రాయింగ్ వేస్తూ ఉండేవాడు అత్తని చూసి నేను వేయలేనా అనిపించి మొదలుపెట్టిందే ఈ ప్రయాణం అప్పటినుంచి బొమ్మలు వేయడం మొదలు పెట్టాను, వేయలేనా అని మొదలుపెట్టింది అదే ప్యాషన్ గా మారుతుంది అని అనుకోలేదు, ఎంత ఇష్టం అంటే మైండ్ డిస్టర్బ్ అయితే డ్రాయింగ్ వేసుకునేవాడిని అలా... అది మన మైండ్ కి ఎంతో విశ్రాంతి ని ఇస్తుంది ఒక కొత్త ప్రపంచం లోకి వెలిపోతాం అస్సలు, అలా నా ప్రయాణం మొదలు పెట్టిను , మధ్యలో కొంతమంది ఎందుకు ఇవి మనకు అన్నా వాళ్లు ఉన్నారు , కానీ కొంతమంది నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అలా చిన్నగా మొదలు పెట్టి కార్టూన్ లు వేసేవాడిని ఇంకా ప్రకృతిని ఖచ్చితమైన చిత్రాలు కాకపోయినా అర్ధమయ్యే విధంగా వేసేవాడిని , నాకు మొహమాటం భయం తో ఎప్పుడు స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొనలేదు అలా స్కూల్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కి చాలామందికి తెలియదు. నేను ఎక్కడ కోచింగ్ కి వెళ్ళలేదు , నాకు ఇన్స్పిరేషన్ "బాపు" గారు ఆ బొమ్మలు చూస్తే బొమ్మలపై అభిమొహం ఉన్నవాలకే తెలుస్తుంది. నాకు చాలామంది ఆర్టిస్టులు నాకు గైడ్డేన్స్ గా నిలిచారు , ఎలా వెయ్యాలి, వేయకూడదు అని చెప్పేవారు, చిన్నగా మనుషులను వేయడం మొదలుపెట్టాను కొన్నిసార్లు మనం వేయలేం అని పక్కనపెట్టాను , మళ్ళీ ఎందుకో వాళ్లు వేస్తున్నారు కదా మనం ఎందుకు వేయలేం అని బేసిక్ గా వేస్తూ వచ్చాను అలా ఇప్పుడు 90% ఫోటో తో మ్యాచ్ అయ్యేలా గీయగలుగుతున్నాను, ఇప్పటివరకు నేను గీసిన బొమ్మలతో ననాకు బాగా నచిన్న బొమ్మ లార్డ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం డ్రాయింగ్ , అది నేను వేయగలను అని చెప్పిన బొమ్మ నాపై నాకు ఫుల్ గా కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసిన బొమ్మ అంత ఆ శ్రీనివాసుడి దయ అనుకోవాలి... ఈమధ్య రాయి లో చెక్కబడిన బొమ్మలని పేపర్ పై వేస్తున్నాను (విగ్రహాలు) , నేను ప్రొఫెషనల్ ని కాదు కానీ నేను చేర్చుకోవాలిసింది చాలా ఉంది ఇంకా...ఇప్పుడు ప్రొఫెషన్ ని మరియు ప్యాషన్ ని బ్యాలెన్సింగ్ చేస్తూ వస్తున్నాను....
అలా ఫోటోగ్రఫీ పై కూడా ఇష్టం పెరిగింది కెమెరా లేదుకాని మొబైల్ లో తీస్తూ ఉంటాను...
Born To Draw 🖌️
Super sai
ReplyDeleteSuper sai &all the best 👍 👌
ReplyDelete